మధ్యప్రదేశ్ కు రూ.575 కోట్ల బకాయిలను ఎగవేసిన తెలంగాణ కొత్త బీర్ కంపెనీ!.. మన్నె క్రిశాంక్ ట్వీట్

by Ramesh Goud |

మధ్యప్రదేశ్ కు రూ.575 కోట్లు ఎగవేసిన సోమ్ డిస్టిల్లరీస్ సంస్థను తెలంగాణకు తెస్తున్నారని, ఈ కంపెనీ తెలంగాణను కూడా దోచుకోవాలని చూస్తున్నారా మంత్రిగారూ అని బీఆర్ఎస్ నేత, మన్నె క్రిశాంక్ అన్నారు.

మధ్యప్రదేశ్ కు రూ.575 కోట్ల బకాయిలను ఎగవేసిన తెలంగాణ కొత్త బీర్ కంపెనీ!.. మన్నె క్రిశాంక్ ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రదేశ్ కు రూ.575 కోట్లు ఎగవేసిన సోమ్ డిస్టిల్లరీస్ సంస్థను తెలంగాణకు తెస్తున్నారని, ఈ కంపెనీ తెలంగాణను కూడా దోచుకోవాలని చూస్తున్నారా మంత్రిగారూ అని బీఆర్ఎస్ నేత, మన్నె క్రిశాంక్ అన్నారు. తెలంగాణలో కొత్త బీర్లను సరఫరా చేసేందుకు అనుమతి పొందిన సోమ్ డిస్టిల్లరీస్ అనే సంస్థ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రుణాలను ఎగవేసిందని తెలిపిన ఆయన దానికి సంబందించిన నోటీస్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీనిపై సోమ్ డిస్టిలరీస్ బీర్‌ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణకు స్వాగతిస్తోందని, ఈ సంస్థ మధ్యప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు రూ.575 కోట్ల బకాయిలను ఎగవేసిందని ఆరోపించారు. ఈ బీర్ కంపెనీ మధ్యప్రదేశ్‌ను లూటీ చేసిందని, దీనిపై పంజాబ్ కేస్రీ (ఎంపీ) పోరాడుతోందని తెలిపారు. ఇక జూపల్లి గారూ ఈ బీర్ కంపెనీ తెలంగాణను కూడా దోచుకోవాలనుకుంటున్నారా? అని మన్నె క్రిశాంక్ వ్యంగ్యంగా ఎక్స్ లో రాసుకొచ్చారు.




Next Story