- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ తొలిపొద్దు కాళోజీ.. వర్ధంతి వేళ కవిత ట్వీట్
స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు (Kaloji Narayana Rao) వర్ధంతి నేడు.

దిశ, వెబ్‌డెస్క్: స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణ రావు (Kaloji Narayana Rao) వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఆయన రచనలు, నిజాంకు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటాన్ని పలువురు ప్రముఖులు స్మరించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కాళోజీ వర్ధంతి వేళ తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా నివాళులర్పించారు. కలం యోధుడు కాళోజీ నారాయణరావు అని కొనియాడారు. ఒక్క సిరా చుక్క.. లక్ష మెదళ్లకు కదలిక అంటూ అక్షరాలను ఆయుధాలుగా చేసి, పాలకులపైకి ఎక్కుపెట్టిన తెలంగాణ (Telangana) తొలిపొద్దు కాళోజీ అని అన్నారు. అణచివేత, అన్యాయం ఎక్కడ, ఏ రూపంలో ఉన్నా ఎదిరించిన తత్వం ఆయనదని తెలిపారు. సామాన్యుడి భాష, యాస ద్వారా సమస్యలపై గళం విప్పి, తెలంగాణ విముక్తి కోసం నిరంతరం పరితపించిన కాళోజీ నారాయణ రావు గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అంటూ కవిత ట్వీట్ చేశారు.






