ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మె

by Malleboina Mahesh |

తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యల సాధనకై విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ సమ్మె బాట పట్టింది.

ఈ నెల 25 నుంచి నిరవధిక సమ్మె
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల సమస్యల సాధనకై విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ సమ్మె బాట పట్టింది. ఆర్టిజన్ కార్మికులకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ ఈనెల 25వ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా సమ్మెకు సంబంధించిన పలు డిమాండ్లను వెల్లడించింది. ఆర్టిజన్ కార్మికులకు ఎక్సిస్టింగ్ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని కోరింది. విద్యార్హతలను బట్టి కన్వెర్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అంతేకాకుండా, 50 శాతం పీఆర్సీ అమలు చేయాలని...నూతనంగా నియమించబడిన ఉద్యోగులకు 35 శాతం పీఆర్సీ అమలు చేయాలని పేర్కొన్నారు. జెన్కో, ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్‌లో ఐడీ కార్డు కలిగి ఉన్న కార్మికులందరిని ఆర్టిజన్‌గా గుర్తించాలని తెలిపింది. ఎన్పీడీసీఎల్‌లో పనిచేస్తున్న అన్‌మెన్ కార్మికులను ఆర్టిజెన్‌లుగా గుర్తించి తమ ఇతరత్ర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ఓ ప్రకటన విడుదల చేసింది.

Next Story