Transport Department: పాత వాహనాలకు HSRP నంబర్ ప్లేట్.. గడువుపై రవాణా శాఖ కీలక ప్రకటన

by Ramesh Naini |

ప్రస్తుతం ప్రభుత్వం పాత వాహనాలకు హెచ్ఎస్ఆర్పీ నంబర్ ప్లేట్ బిగించేందుకు ఎటువంటి గడువు విధించలేదని తెలంగాణ రవాణా శాఖ స్పష్టం చేసింది.

Transport Department: పాత వాహనాలకు HSRP నంబర్ ప్లేట్.. గడువుపై రవాణా శాఖ కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: ప్రస్తుతం ప్రభుత్వం పాత వాహనాలకు హెచ్ఎస్ఆర్పీ (HSRP) నంబర్ ప్లేట్ బిగించేందుకు ఎటువంటి గడువు విధించలేదని (Telangana Transport Department) తెలంగాణ రవాణా శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు శనివారం రవాణా శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. “సెప్టెంబర్ 30 లోగా HSRP నంబర్ ప్లేట్ తప్పనిసరిగా బిగించకపోతే ఆర్టీఏ, ట్రాఫిక్ అధికారులు జరిమానాలు విధిస్తారు” అనే వార్తలు వాస్తవం కావు అని క్లారిటీ ఇచ్చింది. ప్రభుత్వం నుంచి గడువు సంబంధిత అధికారిక ఉత్తర్వులు ఇంకా రవాణా శాఖకు అందలేదని తెలిపింది.

ఈ విషయం ప్రభుత్వ పరిశీలనలో మాత్రమే ఉందని తెలిపింది. కాబట్టి వాహనదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రవాణా శాఖ వివరణ ఇచ్చింది. అదేవిధంగా, HSRP నంబర్ ప్లేట్ బిగిస్తామని కొంతమంది నకిలీ వెబ్‌సైట్లు ప్రచారం చేస్తున్నాయని, వాటిని నమ్మరాదని సూచించింది. అలాగే ఆర్టీఏ చలాన్ల పేరిట వచ్చే అనుమానాస్పద లింక్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయరాదని తెలంగాణ రవాణా శాఖ సూచించింది.

Next Story