- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Tealangana Tourism Policy : తెలంగాణ టూరిజం పాలసీ జీవో విడుదల
తెలంగాణ ప్రభుత్వం నూతన టూరిజం పాలసీ(Tealangana Tourism Policy) జీవోను సోమవారం విడుదల చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం నూతన టూరిజం పాలసీ(Tealangana Tourism Policy) జీవోను సోమవారం విడుదల చేసింది. రాష్ట్రంలో పర్యాటకాన్ని పరుగులు పెట్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం గత డిసెంబర్ లో ప్రభుత్వం తెలంగాణ తొలి టూరిజం పాలసీ సిద్దం చేసింది. అయితే తాజాగా ఈ పాలసీకి మరిన్ని సవరణలు చేసి, మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. ఇందులో భాగంగా దేశంలో పర్యాటక రంగంలో రూ.15 వేల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించడం లక్ష్య్ంగా ఈ పర్యాటక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ పాలసీలో భాగంగా 2025 నుంచి 2030 వరకు ఐదేళ్ల పాటు అమల్లో ఉండేలా పర్యాటక శాఖ రూపొందించింది. పర్యాటక ప్రాజెక్టులను ప్రారంభించేవారికి పలు రాయితీలను ఇవ్వనుంది. ఆయా ప్రాజెక్టులకు సంబంధించి ప్రభుత్వ భూములను కూడా లీజుకు ఇవ్వనున్నారు.
అంతేకాకుండా ఈ పాలసీలో భాగంగా తెలంగాణ టూరిజం పోర్టల్ ను రూపొందించనుంది. ఈ పోర్టల్ లో తెలంగాణకు చరిత్రకు సంబంధించి కొన్న ఏళ్ల నాటి విషయాలను పొందు పరచనున్నారు. రాష్ట్రంలో ప్రక్రుతి, ఆధ్యాత్మిక, చారిత్రక పర్యాటక ప్రదేశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వసతి, భోజనం, రవాణా సౌకర్యాలు, ఫీడ్బ్యాక్ ఇలా సమస్త సమాచారాన్ని ఒకే చోట అందించేందుకు పర్యాటక శాఖ సిద్దమవుతోంది. వన్ స్టాప్ ప్లాట్ ఫాం గా సేవలు అందించేందుకు తెలంగాణ టూరిజం పోర్టల్ ను తీసుకురాబోతుంది. ఈ పాలసీలో భాగంగా రానున్న ఐదేళ్లలో పర్యాటక రంగంలో 15 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించడం, మూడు లక్షల మందికి అదనపు ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకుల్ని ఆకర్షించడంలో దేశంలో తొలి ఐదు స్థానాల్లో తెలంగాణను నిలపడం, రాష్ట్ర ఆదాయంలో 10 శాతం, అంతకంటే ఎక్కవగా టూరిజం నుంచి వచ్చేలా చూడడం వంటి అంశాలను పర్యాటక శాఖ పరిగణలోకి తీసుకుంది.
ఈ మధ్య సినీహిరో నాగార్జున తెలంగాణకు పర్యాటకులను ఆహ్వానిస్తూ టూరిజం ప్రచార వీడియోను ప్రమోట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 27 ప్రత్యేక పర్యాటక ప్రాంతాలను గుర్తించిన పర్యాటక శాఖ యుద్ద ప్రాతిపదికన తొమ్మిదింటిని అభివ్రుద్ది చేయడానికి కార్యాచరణ సిద్దం చేసింది. ప్రత్యేక ప్రాంతాల్లో వికారాబాద్, సోమశీల, కాళేశ్వరం, నాగార్జున సాగర్, భద్రాచలం, వరంగల్, ట్రైబల్ సర్కు్లేట్ ఇందులో జోడేఘాట్, ఉట్నూరు, ఉషేగావ్, కేస్లాగూడ, వన్యప్రాణుల అభయారణ్యం, జలపాతాలు, ఎకోటూరిజం, చార్మినార్ లో లాడ్ బజార్, మక్కామసీదు, చూమోహల్లా ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియం, నిజాం మ్యూజియం ఉన్నాయి.






