- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG TET: తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్.. ఏ సబ్జెక్ట్ ఎప్పుడంటే?
తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అయింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) (TG TET-2025) పరీక్షల షెడ్యూల్ రిలీజ్ (Schedule Release) అయింది. ఈ నెల 18 నుంచి 30 వరకు టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. మొత్తం 9 రోజుల్లో 16 సెషన్స్ లో ఈ పరీక్షలు జరుగుతాయని ప్రతి రోజు రెండు సెషన్స్ లో పరీక్షలు నిర్వహించనున్నట్లు బుధవారం ప్రకటన విడుదల చేసింది. మెదటి సెషన్ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి 4:30 గంటల వరకు నిర్వహిచబోతున్నట్లు పేర్కొంది.
జూన్ 18, 19, 24 తేదీల్లో పేపర్ -2 మ్యాథ్స్ అండ్ సైన్స్ పరీక్షలు, జూన్ 20 నుంచి 23 వరకు, 24 నుంచి 27 వరకు పేపర్ -1 పరీక్షలు జరగనున్నాయి. జూన్ 28 నుంచి 30వ తేదీ వరకు పేపర్ -2(సోషల్ స్టడీస్) ఎగ్జామ్ జరగనుంది. 30 వ తేదీన ఒకే రోజు సెషన్ లో పేపర్ -2 మ్యాథ్స్, సైన్స్ ఎగ్జామ్ కూడా నిర్వహించనున్నారు. ఇక ఈ ఎగ్జామ్స్ కు సంబంధించిన హాల్ టికెట్లు జూన్ 9వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. పూర్తి వివరాల కోసం https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించింది.






