- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Road Accident : వియత్నాంలో తెలంగాణ విద్యార్థి మృతి
వియత్నాం(Vietnam)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు.

దిశ, వెబ్ డెస్క్ : వియత్నాం(Vietnam)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ విద్యార్థి మృతి చెందాడు. కొమురం భీమ్ ఆసిఫాబాద్(Asifabad) జిల్లా, కాగజ్‌నగర్(Kagaznagar)కు చెందిన ఎంబీబీఎస్ మూడో సంవత్సరం విద్యార్థి అర్షిద్ ఆశ్రిత్(Arshid Ashrith)(21) వియత్నాంలో జరిగిన ఓ రోడ్డు ఆక్సిడెంట్(Road Accident) లో మరణించాడు. ఈ ఘటన గత మంగళవారం తెల్లవారుజామున వియత్నాంలోని కాన్ థో నగరంలో సంభవించింది. అర్షిద్ ఆశ్రిత్ తన స్నేహితుడితో కలిసి బైక్ మీద వేగంగా ప్రయాణిస్తూ.. అదుపు తప్పి ఓ ఇంటి గోడను బలంగా ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఆశ్రిత్ సంఘటనా స్థలంలోనే మరణించాడు.
అతని స్నేహితుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆశ్రిత్ తల్లిదండ్రులు అర్షిద్ అర్జున్, ప్రతిమ కాగజ్‌నగర్‌లోని మార్కెట్ ఏరియాలో బట్టల వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ దుర్ఘటన వార్త తెలియడంతో కుటుంబం కన్నీటి సంద్రంలో మునిగి పోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కాగా ఈ ప్రమాద దృశ్యం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కాగా.. నెట్టింట్లో వైరల్ అవుతోంది.






