- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టు పార్టీ చరిత్రలో కీలక పరిణామం.. తెలంగాణ స్టేట్ కమిటీ ఇక లేదు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: తెలంగాణ మావోయిస్టు పార్టీ చరిత్రలో కీలక పరిమామం చోటు చేసుకుంది. మావోయిస్టు పార్టీ స్టేట్ కమిటీ ఇక లేదని ఈ కమిటీకి సంబంధిచి మిగిలిన వారందరూ సరెండర్ అయ్యారని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఇవాళ హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‍లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టులు 124 ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. వీరిలో తెలంగాణ స్టేట్ కమిటీ నుంచి ఐదుగురు లొంగిపోవడంతో ఇక రాష్ట్ర కమిటీ చరిత్రలో మిగిలిపోనుంది. దేశవ్యాప్తంగా తుపాకీ ద్వారానే మార్పు వస్తుందని తెలంగాణ నాయకుల నేతృత్వంలో పోరాటం కొనసాగించిన మావోయిస్టు పార్టీకి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కమిటీ లేకుండా పోయింది. ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో తెలంగాణకు సంబంధించిన వారు ఇతర కమిటీలన్నింటిలో కేవలం ఏడుగురు మాత్రమే ఉన్నారని వారు కూడా త్వరగా సరెండర్ కావాలని పిలుపునిచ్చారు.
ఆయుధాలు కలిగి ఉంటే సహించేది లేదు:
ఇవాళ లొంగిపోయిన వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, ఒక రీజినల్ కమిటీ సభ్యుడు, పది మంది డివిజనల్ కమిటీ సభ్యులు, 46 మంది ఏరియా కమిటీ సభ్యులు, 70 మంది పార్టీ సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన వారు ఒక ఇన్ సాస్ ఎల్ఎంజీ రైఫిల్, 31 ఏకే-47 రైఫిళ్లు, 21)ఇన్‍సాస్ రైఫిళ్లు, 20 ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు, (18) 303 రైఫిళ్లు, 33 ఇతర తుపాకులను ప్రభుత్వానికి అప్పగించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మావోయిస్టుల హోదాలను బట్టి ప్యాకేజీ కల్పిస్తామని ఇంటి స్థలం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో భూమి లభ్యత కష్టంగా ఉన్నందునా భూమి ఇవ్వడంపై హామీ ఇవ్వలేనన్నారు. రాష్ట్రంలో హింసకు తావులేదని అక్రమంగా ఆయుధాలు కలిగి ఉంటే సహించేది లేదన్నారు.






