తెలంగాణ సచివాలయ సెక్షన్ ఆఫీసర్ల నియామకాలు నిలిపివేత

by Muthe.Rajitha |

తెలంగాణ సచివాలయ నియామకాల్లో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇటీవల సెక్షన్ ఆఫీసర్ల నియామకాలకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

తెలంగాణ సచివాలయ సెక్షన్ ఆఫీసర్ల నియామకాలు నిలిపివేత
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ సచివాలయ నియామకాల్లో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. సచివాలయ సెక్షన్ ఆఫీసర్ల నియామకాలను రద్దు చేస్తూ ఆర్డర్స్ జారీ చేసింది. అయితే ఇటీవల సెక్షన్ ఆఫీసర్ల నియామకాలకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. అయితే వీటిలో 12.5% సచివాలయ HOD ల కోటాను ప్రకటించారు. కాగా ఈ కోటా వలన తమకు అన్యాయం జరుగుతుందని సెక్రటేరియట్ ఆఫీసర్స్ అసోసియేషన్‌ అభ్యంతరం తెలుపుతూ ప్రభుత్వానికి తెలిపింది.

ఇప్పటికే సెక్షన్ ఆఫీసర్లుగా HOD లే ఎక్కువగా ఉన్నారని, మళ్ళీ వారికే అవకాశాలు ఇస్తే మా సంగతి ఏమిటని ప్రభుత్వం దగ్గర వాపోవడంతో.. ఈ నియామకాలను తాత్కాలికంగా రద్దు చేసింది ప్రభుత్వం. అలాగే ఈనెల 14న విడుదల చేసిన నియామకాల జీవోను కూడా రద్దు చేసింది. అంతేకాదు సచివాలయ సూపరింటెండెంట్లనే సెక్షన్ ఆఫీసర్లుగా బదిలీ చేస్తూ.. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఈ ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొంది.

Next Story