- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025.. మంత్రుల సమీక్షల షెడ్యూల్ విడుదల
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 (Telangana Rising Global Summit-2025) నిర్వహణ, ఏర్పాట్లపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో వరుసగా సమీక్షలు చేపడుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 (Telangana Rising Global Summit-2025) నిర్వహణ, ఏర్పాట్లపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో వరుసగా సమీక్షలు చేపడుతున్నారు. మరోవైపు ‘తెలంగాణ రైజింగ్-2047’ డాక్యుమెంట్‌కు అధికారులు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఈరోజు (నవంబర్ 25) నుంచి నవంబర్ 30 వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వేదికగా వరుసగా రివ్యూ మీటింగ్స్ జరగనున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి దండే శ్రీధర్ బాబు వరుసగా జరిగే అన్ని సమీటింగ్స్‌లో పాల్గొంటారు.
సమీక్షల షెడ్యూల్ వివరాలు ఇలా..
నవంబర్ 26: లాజిస్టిక్స్ ఏర్పాట్లపై రివ్యూ
పాల్గొనే వారు: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్ (సీతక్క), సంబంధిత అధికారులు
నవంబర్ 27: మౌలిక వసతులు, అభివృద్ధిపై సమీక్ష
పాల్గొనే వారు: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు హెచ్. వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, దానం నాగేందర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంబంధిత అధికారులు
నవంబర్ 28:
సాయంత్రం 4 గంటలకు – విద్య, యువజన సంక్షేమం
పాల్గొనే వారు: మంత్రులు వాకిటి శ్రీహరి, హెచ్. వివేక్ వెంకటస్వామి, సంబంధిత అధికారులు
సాయంత్రం 6 గంటలకు – టూరిజం, టెంపుల్ టూరిజం
పాల్గొనే వారు: మంత్రులు జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సంబంధిత అధికారులు
నవంబర్ 29:
సాయంత్రం 4 గంటలకు – వ్యవసాయం, సంక్షేమ విభాగాలు
పాల్గొనే వారు: మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి
సాయంత్రం 6 గంటలకు – మైనారిటీ, గిరిజన సంక్షేమం మొదలైనవి
పాల్గొనే వారు: మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, దానం నాగేందర్ (సీతక్క)
నవంబర్ 30: ఆరోగ్య రంగం
పాల్గొనే వారు: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనరసింహ, సంబంధిత శాఖ అధికారులు






