తెలంగాణ రాజ్‌భవన్‌.. 'లోక్‌భవన్‌'గా మార్పు

by Muthe.Rajitha |   (  Updated:2025-12-02 13:06:29  IST  )

కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని గవర్నర్ల అధికారిక నివాసాల పేర్లను ఇటీవల మార్చిన సంగతి తెలిసిందే.

తెలంగాణ రాజ్‌భవన్‌.. లోక్‌భవన్‌గా మార్పు
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని గవర్నర్ల అధికారిక నివాసాల పేర్లను ఇటీవల మార్చిన సంగతి తెలిసిందే. ఇదివరకు గవర్నర్ల అధికారిక నివాసాల పేర్లు 'రాజ్ భవన్' గా ఉండగా.. వాటిని 'లోక్ భవన్' గా మార్చింది. ఈక్రమంలో నేడు తెలంగాణ రాజ్‌భవన్‌ పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిషికేషన్‌ జారీ చేసింది. తెలంగాణ గవర్నర్ అధికారిక నివాసం 'రాజ్‌భవన్, తెలంగాణ' ఇకపై 'లోక్‌భవన్, తెలంగాణ' అని పిలవబడుతుందని తెలిపింది.

వికసిత్ భారత్ వైపు ముందుకు సాగుతున్న సమయంలో.. మనదేశ ప్రజాస్వామ్య విలువల బలాన్ని, చైతన్యాన్ని పునరుద్ఘాటించడానికి ఈ నిర్ణయం తీసుకోబడిందని పేర్కొంది. సైన్‌బోర్డులు, అధికారిక వెబ్‌సైట్లు, లెటర్‌హెడ్‌లలో తక్షణమే ఈ మార్పు అమల్లోకి వస్తున్నట్టు రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Next Story