- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దక్షిణ తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు అలర్ట్
తెలంగాణలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు ఎండలు మండిపోతుండగా మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఓవైపు ఎండలు మండిపోతుండగా మరోవైపు వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీంతో ఎప్పుడు వాతావరణం ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. తాజాగా దక్షిణ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. హైదరాబాద్ తో పాటూ ఉమ్మడి రంగారెడ్డి, వరంగల్, నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాాతావరణశాఖ స్పష్టం చేసింది. 30 నుండి 40 కి.మీల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాాతావరణశాఖ ప్రకటించింది. ఇదిలా ఉంటే శుక్ర, శనివారాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. శుక్రవారం హైదరాబాద్‌లో కురిసిన వర్షాలకు చాలా చోట్ల రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.






