- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Telangana Police: ట్రెండ్ ఫాలో అవ్వండి.. కానీ ఆ పని మాత్రం చేయకండి!
సైబర్ నేరగాళ్ల(Cyber Crimes) పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నా కొందరిలో ఎటువంటి మార్పు రావడం లేదు.

దిశ, వెబ్‌డెస్క్: సైబర్ నేరగాళ్ల(Cyber Crimes) పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నా కొందరిలో ఎటువంటి మార్పు రావడం లేదు. అత్యాశకు పోయి జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టుకుంటున్నారు. ఫోన్‌లకు వచ్చే లింక్స్ క్లిక్ చేయొద్దని.. డబ్బులు ఆశజూపి మొత్తం లాగేస్తారని ఇప్పటికే పోలీసులు అనేకసార్లు హెచ్చరికలు చేశారు. అంతేకాదు.. అందరిలో అవగాహన రావాలని.. ఫోన్‌లకు వాయిస్ మెసేజ్‌లు, సోషల్ మీడియాలో ప్రకటనలతో పాటు బయట రోడ్లమీద పెద్ద పెద్ద హోర్డింగులూ పెడుతున్నారు. అయినా కొందరు ఏమాత్రం ఎడ్యూకేట్ కావడం లేదు.
తాజాగా మరోసారి అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఘిబ్లీ ఇమేజెస్(Ghibli Images)తో ప్రమాదం అని హెచ్చరిస్తున్నా మారడం లేదు. రోజూ ఎవరో ఒకరు ఏదో ఒకటి చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం.. అదే ట్రెండ్ కావటం, దానినే గుడ్డిగా ఫాలో కావటం చేస్తున్నారు. సినీ ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ అందరూ ఇలాగే ఉన్నారు. అయితే ఘిబ్లీ(Ghibli) వెనుక ఓ ప్రమాదం ఉందంటున్నారు పోలీసులు. ఘిబ్లీ ఆర్ట్ దుర్వినియోగం అవుతున్న ఘటనలు పెరుగుతున్నాయని, జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ‘సోషల్ మీడియా ట్రెండ్ మాయలో పడి చిక్కుల్లో పడకండి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ట్రెండింగ్ అవుతున్న ఘిబ్లీ ఇమేజెస్ పేరిట సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉంది. వీటి కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసేటప్పుడు జాగ్రత్త. సైబర్ మోసగాళ్లు వేసే వలలో పడకండి’ అని హెచ్చరిస్తూ తెలంగాణ పోలీసులు(Telangana Police) సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు.
సోషల్ మీడియా ట్రెండ్ మాయలో పడి చిక్కుల్లో పడకండి. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ట్రెండింగ్ అవుతున్న #gibli ఇమేజెస్ పేరిట సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉంది. వీటి కోసం ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసేటప్పుడు జాగ్రత్త. సైబర్ మోసగాళ్లు వేసే వలలో పడకండి.#TelanganaPolice #ghiblitrend #giblistudio pic.twitter.com/HdWMtX6ODz
— Telangana Police (@TelanganaCOPs) April 13, 2025






