- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Telangana Police : వరద బాధితులకు తెలంగాణ పోలీసులు భారీ విరాళం
తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వరదలు వచ్చిన విషయం తెలిసిందే.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వరదలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో పంట నష్టం, ప్రాణ నష్టం, ఎంతో మంది నిరాశ్రయులు అయ్యారు. ప్రభుత్వం పిలుపు మేరకు వరద బాధితుల సహాయార్ధం ప్రముఖులు, సెలబ్రీటీలు, నేతలు, ప్రజలు భారీగా సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు అందిస్తున్నారు.
ఈ క్రమంలోనే వరద బాధితుల కోసం తెలంగాణ పోలీసులు ఒక రోజు జీతాన్ని విరాళంగా ఇచ్చారు. తెలంగాణ పోలీసుల తరపున ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.11,06,83,571ల విరాళం అందించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో ఎస్సై పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డికి డీజీపీ జితేందర్ చెక్‌ను అందజేశారు.
Next Story






