Municipal elections: ఎగ్జిట్ పోల్స్ లో సంచలనం... ఆ రెండు పార్టీల భవిష్యత్ తేల్చేసిన మరో రెండు సర్వే సంస్థలు

by Prasad Jukanti |   (  Updated:2026-02-11 13:47:45  IST  )

తెలంగాణ మున్సిపల్ ఎన్నికలపై సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ అంచనాలను విడుదల చేస్తున్నాయి.

Municipal elections: ఎగ్జిట్ పోల్స్ లో సంచలనం... ఆ రెండు పార్టీల భవిష్యత్ తేల్చేసిన మరో రెండు సర్వే సంస్థలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో16 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్‌ ముగిసింది. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనే దానిపై ఎగ్జిట్ పోల్స్ ఒక్కొక్కటిగా విడుదలవుతున్నాయి. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే కాంగ్రెస్ కే ఆధిపత్యం ఉందని అంచనా వేయగా తాజాగా మరో రెండు సర్వే సంస్థలు తమ అంచనాలను రిలీజ్ చేశాయి. బీకాన్ సంస్థ అంచనాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ 80-85 మున్సిపాలిటీలను గెలవబోతోందని అంచనా వేసింది. ఇక బీఆర్ఎస్ 8-10, బీజేపీ 4-6 మున్సిపాలిటీలను కైవసం చేసుకోబోతోందని, 21 మున్సిపాలిటీల్లో హంగ్ లేదా ఇతరులు కైవసం చేసుకోబోతున్నట్లు ప్రిడిక్షన్ ఇచ్చింది.

ఆపరేషన్ చాణ్యక్య:

ఆపరేషన్ చాణక్య సర్వే సంస్థ ప్రకారం మొత్తం మున్సిపల్ వార్డుల్లో కాంగ్రెస్ 1400-1449 (48.0శాతం) వార్డులలో, బీఆర్ఎస్ 745 -793 (26.06శాతం), బీజేపీ 358-399 (13.04శాతం), ఎంఐఎం 150-187(6.03శాతం), జనసేన 30-35 (1.02 శాతం) ఇతరులు80-119(4శాతం) కైవసం చేసుకోబోతున్నట్లు తేల్చింది.

పురపోరులో తమ సత్తా చాటుతామని ప్రధాన పార్టీలు సవాళ్లు చేసినప్పటికీ ఓటర్లను మెప్పించడంలో ప్రధాన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు వెనుకబడిపోయాయని ఈ సర్వే అంచనాలు స్పష్టం చేశాయి. ఇక ఆపరేషన్ చాణక్య ప్రకారం జనసేన 30-35 స్థానాల్లో బోణీ కొట్టబోతోందని అంచనా వేయడం ఆసక్తిగా మారింది. మరి ఈ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ గా వస్తాయా లేక తారుమారు అవుతాయా అనేది ఎల్లుండి తేలనుంది.

Next Story