రాష్ట్రపతితో కలిసి ఆఫ్రికా పర్యటనకు తెలంగాణ MP

by Gantepaka Srikanth |

రాష్ట్రపతితో కలిసి ఆఫ్రికా పర్యటనకు తెలంగాణ MP

రాష్ట్రపతితో కలిసి ఆఫ్రికా పర్యటనకు తెలంగాణ MP
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రాన్ని జాతీయ మరియు అంతర్జాతీయ వేదికలపై ప్రతినిధిత్వం చేస్తూ, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ(DK Aruna) రాష్ట్రపతి(President Draupadi Murmu)తో కలిసి ఆఫ్రికా అధికారిక పర్యటనలో పాల్గొనబోతున్నారు. ఈ పర్యటనలో దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, వ్యవసాయం, సాంకేతికత, సాంస్కృతిక మార్పిడి రంగాల్లో పరస్పర సహకారాన్ని పెంపొందించడం ప్రధాన లక్ష్యంగా ఉంది. ఈ పర్యటనలో భారత్ మరియు ఆఫ్రికా దేశాల మధ్య ముఖ్యంగా కింది అంశాలపై చర్చలు జరుగనున్నాయి.

= వ్యవసాయ అభివృద్ధి

= మహిళా సాధికారత

= విద్య మరియు నైపుణ్యాభివృద్ధి

= ఆరోగ్య సేవల విస్తరణ

= పారిశ్రామిక పెట్టుబడుల అవకాశాలు

= సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ

తెలంగాణ మహిళా నాయకత్వాన్ని ప్రపంచ వేదికపై ప్రతిష్టాత్మకంగా నిలబెట్టే కీలక అవకాశంగా డీకే అరుణ ఈ భాగస్వామ్యాన్ని భావిస్తున్నారు. గ్రామీణాభివృద్ధి, మహిళల పురోభివృద్ధి, రైతుల సంక్షేమం వంటి అంశాల్లో డీకే అరుణ చేపట్టిన కార్యక్రమాలు, సేవలు రాష్ట్రవ్యాప్తంగా మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందాయి. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. “ప్రపంచ ప్రగతిలో తెలంగాణ తన పాత్రను ఇంకా బలంగా నిలబెట్టుకోవడం నా లక్ష్యం. ఈ పర్యటన ద్వారా మహిళలు, రైతులు, యువతకు ఉపయోగపడే అవకాశాలను మన రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు నేను పూర్తిస్థాయిలో కృషి చేయాలనీ వారికీ భావన’’ అనిపేర్కొన్నారు. ఈ పర్యటన ద్వారా భారత్–ఆఫ్రికా సంబంధాలు కొత్త దిశగా విస్తరించనున్నాయని తెలంగాణ రాష్ట్రానికి ఇది ప్రతిష్టాత్మక సందర్భం అని నిపుణులు భావిస్తున్నారు.

Next Story