- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG News : డెంటిస్టులకు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బిగ్ షాక్
డెంటిస్టులకు(Dentists) తెలంగాణ మెడికల్ కౌన్సిల్(Telangana Medical Council) బిగ్ షాకిచ్చింది. డెంటిస్టులు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్, ప్లాస్టిక్ సర్జరీ వంటి కాస్మెటిక్ ప్రొసీజర్‌లు నిర్వహించడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : డెంటిస్టులకు(Dentists) తెలంగాణ మెడికల్ కౌన్సిల్(Telangana Medical Council) బిగ్ షాకిచ్చింది. డెంటిస్టులు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్, ప్లాస్టిక్ సర్జరీ వంటి కాస్మెటిక్ ప్రొసీజర్‌లు నిర్వహించడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) మార్గదర్శకాల ఆధారంగా TMC ఒక ప్రకటన జారీ చేసింది. ఇకపై డెంటిస్టులు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్లాస్టిక్ సర్జరీ వంటి కాస్మెటిక్ ప్రొసీజర్‌లు నిర్వహించడానికి అనుమతి లేదని తెలిపింది. డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (DCI) నిబంధనల ప్రకారం బీడీఎస్ లేదా ఎండీఎస్ డిగ్రీ కలిగిన డెంటిస్టులు కేవలం ఓరల్, మాక్సిలోఫేషియల్ సర్జరీలకు మాత్రమే అర్హులని పేర్కొంది.
ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా ఇటీవల కొందరు డెంటిస్టులు అర్హత లేకుండా ఈ ప్రొసీజర్‌లు చేస్తున్నట్లు భారీగా ఫిర్యాదులు రావడంతో, రోగుల భద్రతను కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రజలు ఇటువంటి చికిత్సల కోసం MBBS, MS లేదా MD స్పెషలైజేషన్ కలిగిన వైద్యులను సంప్రదించాలని మెడికల్ కౌన్సిల్ సూచించింది.






