కస్టోడియల్ డెత్‌పై విచారణ జరపాలి.. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత డిమాండ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-20 04:22:26  IST  )

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ సబ్ జైలులో కర్ల రాజేశ్ (Rajesh) అనే దళిత యువకుడి కస్టడీ మరణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.

కస్టోడియల్ డెత్‌పై విచారణ జరపాలి.. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత డిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ సబ్ జైలులో కర్ల రాజేశ్ (Rajesh) అనే దళిత యువకుడి కస్టడీ మరణం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై బాధిత కుటుంబానికి న్యాయం జరగాలంటూ బంధువులు, స్థానికులు, దళిత సంఘాల నాయకులు పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలోనే రాజేశ్ మరణంపై తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత (Kavitha) స్పందించారు. సూర్యాపేట జిల్లాలో కస్టడీలో ఉన్న ఓ దళిత బిడ్డను పోలీసులు కొట్టి చంపడం దారుణమని, బాధిత కుటుంబాన్ని బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఈ కస్టోడియల్ డెత్‌పై వెంటనే ప్రభుత్వం విచారణ చేపట్టాలని, డీజీపీ శివధర్‌రెడ్డి (DGP Shivadhar Reddy) లేదా సంబంధిత అధికారులు చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story