- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KTR : దినదిన గండంగా తెలంగాణం : కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజల బతుకులు దినదిన గండం(More Critical)గా మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజల బతుకులు దినదిన గండం(More Critical)గా మారాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) విమర్శించారు. లగచర్లలో భూసేకరణ(Land Acquisition In Lagacharla)ప్రక్రియ వివాదాన్ని(Controversy)ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తొలి గండం దాటితే తొంభై ఏండ్ల ఆయుష్షు అని పెద్దల మాట..కాని అల్లుని కంపెనీల కోసం.. అదానీ పరిశ్రమల కోసం..అన్నదమ్ముల ఆస్తుల పెంపు కోసం..ఢిల్లీకి మూటల చేరవేత కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతున్న చర్యలతో తెలంగాణలో ప్రజల పరిస్థితి దినదిన గండమైందంటూ కేటీఆర్ విమర్శించారు.
లగచర్లలో పేదల భూములు లాక్కునేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్రలను ఎదుర్కొని లాఠీల దెబ్బలు తిని, చేతులకు బేడీలు వేసుకొని, నెలలపాటు చెరసాలల పాలైనా..భూములను చెరబట్టడంలో మాత్రం రేవంత్ ప్రభుత్వం పట్టువదలడం లేదంటూ మండిపడ్డారు. పట్నంలో పేదల గూళ్లు, ఉపాధి కేంద్రాలు..పాలడబ్బాలు, చెప్పుల దుకాణాలు...పల్లెల్లో పేదల భూములు, పల్లెల్లో గరీబోళ్ల ఇండ్లు, పంటపొలాలు, పచ్చని పైర్లలో రేవంత్ అధికారుల స్వైర విహారం..కాదేది అణచివేతకు అనర్హం కాదన్నట్టు తెలంగాణలో కాంగ్రెస్ పాలన సాగుతుందంటూ మండిపడ్డారు. పదేళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఏడాది కాలంగా ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితి నెలకొందని..దినదిన గండంగా తెలంగాణం పరిస్థితి మారిందని..ఎట్లుండె తెలంగాణ..ఎట్లాయె తెలంగాణ అంటూ కేటీఆర్ తన ట్వీట్ లో ఆందోళన వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని లగచర్లలో పారిశ్రామిక వాడ కోసం భూసేకరణ ప్రక్రియను తాజాగా మళ్లీ కొనసాగించడం..స్థానిక ప్రజలు వ్యతిరేకించడంతో మళ్లీ ఇక్కడ వివాదం రాజుకుంది. లగచర్ల, రోటిబండ, పులిచర్ల కుంట గ్రామాల్లో 110ఎకరాల భూసేకరణ ప్రక్రియను వందలాది పోలీసు బలగాల మధ్య కొనసాగించగా..భూసేకరణ ప్రక్రియకు స్థానికులు అడ్డుతగిలారు. మరోవైపు హైదరాబాద్ ఉప్పల్ చిలుకానగర్ లోని కల్యాణపురి పార్కు వద్ధ ఓ మహిళ పాలకేంద్రాన్ని జీహెచ్ఎంసీ అధికారులు జేసీబీతోకూల్చివేశారు. తన జీవనోపాధిని దెబ్బతీశారంటూ బాధిత మహిళ వాపోయింది. ఆయా సంఘటనలలో ప్రభుత్వం తీరుపై కేటీఆర్ మండిపడ్డారు.






