- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: హౌసింగ్ బోర్డుకు రూ.34.27 కోట్ల ఆదాయం
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న హౌసింగ్ బోర్డు భూములకు మరోసారి డిమాండ్ వచ్చిందని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న హౌసింగ్ బోర్డు భూములకు మరోసారి డిమాండ్ వచ్చిందని హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వీపీ గౌతం తెలిపారు. దాంతో హౌసింగ్ బోర్డుకు భారీగా ఆదాయం వచ్చింది. గచ్చిబౌలి ప్రాంతంలో చదరపు గజానికి రూ.1.76 లక్షలు, కూకట్‌పల్లిలో రూ.1.64 లక్షలకు కొనుగోలు చేశారు. గచ్చిబౌలి, భౌరంపేట్, బాలాజీనగర్, చింతల్ తదితర ప్రాంతాల్లోని మొత్తం 14 భూములను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి ఈ నెల 9వ తేదీన హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. కేపీహెచ్‌బీ హౌసింగ్ బోర్డు కమ్యూనిటీ హాల్‌లో సోమవారం నిర్వహించింది. ఈ వేలం పాటలో సుమారు 50 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. విక్రయించిన వాటిలో బౌరంపేట భూమితోపాటు బాచుపల్లిలో ఒక ఫ్లాట్ మినహా మిగిలినవ్నీ ఎంఐజీ, హెఐజీ కేటగిరీలోని ప్లాట్లు కావడంతో వీటిని దక్కించుకోడానికి పలువురు పోటీపడ్డారు.
గచ్చిబౌలిలోని 263 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్‌కు రూ.50 వేల కనీస ధరగా నిర్ధారించి వేలం నిర్వహించారు. దీనికి చదరపు గజం రూ.1.76 లక్షల ధర పలికింది. అదేవిధంగా కూకట్‌పల్లి బాలాజీనగర్‌లోని 266 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్‌ను వేలం పాటలో రూ.1.64 లక్షలకు కొనుగోలు చేశారు. అలాగే చింతల్ ప్రాంతంలోని ఓపెన్ ప్లాట్లకు సైతం చదరపు గజం రూ.84 వేలు, రూ.74 వేల ధరలతో అమ్ముడు పోయినట్లు పేర్కొన్నారు. అలాగే నిజాంపేటలోని సిద్ధి ఫ్లాట్‌కు కనీస ధర రూ.15 లక్షలుగా నిర్ధారించగా దీనిని వేలం పాటలో రూ.17.70 లక్షలకు కొనుగోలు చేశారు. అలాగే గచ్చిబౌలిలోని మరో ప్లాట్ చదరపు గజం లక్ష రూపాయలు పలికినట్లు తెలిపారు. కాగా.. బౌరంపేటలోని 2,600 చదరపు గజాల విస్తీర్ణంలోని భూమిని చదరపు గజం రూ.61 వేలకు అమ్ముడుపోయింది. మొత్తంగా సోమవారం నాటి భూముల విక్రయాల ద్వారా రూ.34.27 కోట్ల మేర ఆదాయం వచ్చిందని వివరించారు.






