- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG High Court: వక్ఫ్‌బోర్డు తీరుపై తెలంగాణ హైకోర్టు సీరియస్
వక్ఫ్‌బోర్డు తీరుపై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయింది.

దిశ, డైనమిక్ బ్యూరో: దివ్య ఖురాన్ స్ఫూర్తిని విస్మరించారని వక్ఫ్ బోర్డుపై (Waqf Board) తెలంగాణ హైకోర్టు (TG High Court) సీరియస్ అయింది. వక్ఫ్ బోర్డుపై గతేడాది హైకోర్టులో పలు పిటిషనలు దాఖలు కాగా వాటిపై ఇవాళ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పేదల పక్షాన వక్ఫ్ బోర్డు పని చేయడం లేదని, ఖురాన్ స్పూర్తిని మర్చిపోయారని వక్ఫ్ బోర్డుతో పాటు పిటిషనర్ తీరుపై జస్టిస్ నగేశ్ భీమపాక వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పవిత్ర ఖురాన్ లోని పేరాలను జస్టిస్ నగేశ్ భీమపాక ఉటంకించారు. పాదరక్షలు విడిచి అనంత కరుణామయుడు అల్లా పేరిట అందులోని అంశాలను చదవి వినిపించారు. ఇబాదత్ ఖానాను స్వాధీనం చేసుకోవాలని గతేడాది హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అమలు చేయకపోవడంపై కోర్టు వక్ఫ్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇబాదత్ ఖానాను (Ibadatkhana) స్వాధీనం చేసుకోవాలని, దీని నిర్వహణకు కమిటీ వేసి అందులో ఈక్వల్ మెంబర్స్ కు చోటు కల్పించాలని గతేడాది హైకోర్టు వక్ఫ్ బోర్డుకు సూచించింది.






