తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ‘పొలవరం-నల్లమల సాగర్’ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు

by Kema Shiva Kumar |

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో పొలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ‘పొలవరం-నల్లమల సాగర్’ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టుకు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో పొలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన విషయం తెలిసిందే. అయితే, ఆ లింక్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు కేంద్ర జలశక్తికి ఫిర్యాదు చేసింది. దీంతో ఏపీ సర్కార్ పొలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు వెనక్కి తగ్గింది. అయితే, తాజాగా పొలవరం నీటిని బొల్లాపల్లి, నల్లమల సాగర్ జలాశయాలకు తరలించడమే లక్ష్యంగా పొలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు పేరును మార్చి పొలవరం-నల్లమల సాగర్ (Polavaram-Nallamala Sagar) నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఈ మేరకు ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి టెండర్లను ఇటీవల విడుదల చేసింది.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఏపీ సర్కారు నిర్మించ తలపెట్టిన పొలవరం-నల్లమల సాగర్ సాగునీటి ప్రాజెక్టుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court)లో అభ్యంతరాలు దాఖలు చేయాలని నిర్ణయించిందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) వెల్లడించారు. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ (Abhishek Manu Singhvi) కేసును వాదించాలని కోరినట్లుగా పేర్కొన్నారు. ఈ మేరకు రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో పొలవరం-బనకచర్ల సుప్రీంకోర్టు కేసుపై సన్నాహక సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 2.30కి అభిషేక్ మను సింఘ్వీతో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు.

Next Story