తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కు రూ.375 కోట్లు విడుదల

by Kema Shiva Kumar |

మూసీ ప్రక్షాళణకు తెలంగాణ సర్కార్ (Telangana Government) తొలి అడుగు వేసింది.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌కు రూ.375 కోట్లు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: మూసీ ప్రక్షాళణకు తెలంగాణ సర్కార్ (Telangana Government) తొలి అడుగు వేసింది. ఈ నేపథ్యంలోనే మూసీ రివర్ ఫ్రంట్‌ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు (Musi Riverfront Development Project)కు 2024-205 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌లో కేటాయించిన రూ.375 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ఇవాళ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. మూసీ నది ప్రక్షాళనను ప్రతష్టాత్మకంగా తీసుకున్న సర్కార్ భాగంగా ఇప్పటికే నది పరివాహక ప్రాంతాల్లో ఉన్న నిర్మాణాలను ఇప్పటికే సంగం వరకు తొలగించారు. ప్రస్తుతం మూసీ నదిలో పేరుకుపోయిన చెత్తను తొలగించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా నిధుల విడుదలతో మూసీ ప్రక్షాళన మరింత వేగం పుంజుకునే అవకాశం ఉంది.

అయితే, మూసీ సుందరీకరణ (Musi Beautification)కు గాను రూ.4,100 కోట్ల రుణం ఇచ్చేందుకు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (Asian Development Bank) ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. మూసీ సుందరీకరణ, ప్రక్షాళన కోసం నియమించిన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (Musi Riverfront Development Corporation Limited) అధికారులు రాష్ట్రానికి వచ్చిన ఏడీబీ టీమ్‌కు మూసీ ప్రక్షాళనతో పాటుగా చేపట్టబోయే పర్యావరణ కార్యక్రమాల గురించి కూడా వివరించారు. దీంతో మూసీ ప్రక్షాళనకు నిధులు విడుదలకు కూడా లైన క్లియర్ అయింది. ఈ ప్రాజెక్టులో భాగంగా మూసీ నదికి ఇరువైపులా రోడ్లు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. అదేవిధంగా మూసీ నదిలో వరద నీరుతో పాటు డ్రైనేజీ నీరును వేరు చేసేందుకు ఇంటర్ సెప్టర్ ఛానెల్ నెట్‌వర్క్‌ (Interceptor Channel Network) పద్ధతిలో ప్రాజెక్ట్ నిర్మాణానికి రూపకల్పన చేశారు.

Next Story