తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గద్దర్ ఫౌండేషన్‌కు రూ.3 కోట్ల నిధులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-14 06:06:51  IST  )

ప్రజా గాయకుడు గద్దర్ (Gaddar) ఆలోచనలతో పాటు ఆయన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. గద్దర్ ఫౌండేషన్‌కు రూ.3 కోట్ల నిధులు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రజా గాయకుడు గద్దర్ (Gaddar) ఆలోచనలతో పాటు ఆయన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సికింద్రాబాద్‌లోని గద్దర్ ఫౌండేషన్‌ (Gaddar Foundation)కు భాషా సంస్కృతిక శాఖ రూ.3 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ శుక్రవారం రాత్రి పాలనాపరమైన అనుమతులకు సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి ఏటా జనవరి 31న గద్దర్ జయంతి, సంక్షేమ కార్యక్రమాలకు ఆ నిధులను వినియోగించనున్నారు.

Next Story