HYD: మెట్రో రెండో దశకు వేగంగా అడుగులు.. కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించిన ప్రభుత్వం

by Gantepaka Srikanth |

హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 (బీ) ప్రతిపాదనతో పాటు అవసరమైన అన్ని పత్రాలు, డీపీఆర్‌లను శనివారం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్టు హైదరాబాద్ ఎండీ ఎన్వీఎస్.రెడ్డి వెల్లడించారు.

HYD: మెట్రో రెండో దశకు వేగంగా అడుగులు.. కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించిన ప్రభుత్వం
X

దిశ, సిటీ బ్యూరో: హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 (బీ) ప్రతిపాదనతో పాటు అవసరమైన అన్ని పత్రాలు, డీపీఆర్‌లను శనివారం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్టు హైదరాబాద్ ఎండీ ఎన్వీఎస్.రెడ్డి వెల్లడించారు. ఇటీవల రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిన ఈ ఫేజ్-2 (బీ) ప్రాజెక్టులో 3 కారిడార్లు ఉన్నాయి - ఆర్‌జీఐఏ నుండి భారత్ ఫ్యూచర్ సిటీ (39.6 కి.మీ; రు. 7,168 కోట్లు), జేబీఎస్ నుండి మేడ్చల్ (24.5 కి.మీ; రు. 6,946 కోట్లు), జేబీఎస్ నుండి శామీర్‌పేట (22 కి.మీ; రు. 5,465 కోట్లు) మొత్తం 86.1 కి.మీ పొడవును కవర్ చేసే ఈ ఫేజ్ 2 (బి) ప్రాజెక్టులో మొత్తం రు. 19,579 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. గతంలో సమర్పించిన ఐదు కారిడార్ల (76.4 కి.మీ) ఫేజ్ 2(ఎ) ప్రాజెక్టు మాదిరిగానే, ఈ ఫేజ్ 2 (బి) ప్రాజెక్టును కూడా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించినట్టు మెట్రో ఎండీ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ జేవీ ప్రాజెక్టు నిబంధనల ప్రకారం, ఫేజ్-2 (బి) వ్యయం రు. 19,579 కోట్లలో తెలంగాణ ప్రభుత్వం వాటా రు. 5,874 కోట్లు (30 శాతం), కేంద్ర ప్రభుత్వ వాటా రు. 3,524 కోట్లు (18 శాతం); అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుండి రుణంగా రు. 9,398 కోట్లు (48 శాతం), చిన్న మొత్తంలో పీపీపీ భాగంగా రు. 783 కోట్లు (4 శాతం) ఉంటాయని తెలిపారు.

Next Story