- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG Govt: వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల వర్కింగ్ అవర్స్ పెంపు

దిశ, డైనమిక్ బ్యూరో: వ్యాపార వాణిజ్య కేంద్రాల్లో పని గంటల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం (TG Govt) కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పని వేళల పరిమితిని (increases working hours) సవరించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా ని వేళలు సవరిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. తాజా మార్పుల ప్రకారం రోజుకు 10 గంటల వరకు పని చేసేందుకు అనుమతి ఇచ్చింది. వారంలో పని వేళలు 48 గంటలు మించరాదని ఒక వేళ పరిమితి దాటితే ఓటీ వేతనం చెల్లించాలని ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రోజులో 6 గంటల్లో కనీసం అరగంట విశ్రాంతి ఇవ్వాలని విశ్రాంతితో కలిపి 12 గంటల కంటే ఎక్కువ పని చేయించరాదని స్పష్టం చేసింది.
కాగా అంధ్రప్రదేశ్ సైతం ఇటీవలే వ్యాపారాన్ని సులభతరం చేయడం మరియు పెట్టుబడిదారులను ఆకర్షించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రోజుకు గరిష్ట పని గంటలను తొమ్మిది నుండి 10కి పెంచాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని ఏపీ సీపీఐ పార్టీ వ్యతిరేకించింది.






