దివ్యాంగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. దశాబ్దాల సమస్యకు చెక్ పెడుతూ జీవో

by Ramesh Naini |

దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana government) శుభవార్త చెప్పింది.

దివ్యాంగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. దశాబ్దాల సమస్యకు చెక్ పెడుతూ జీవో
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో : దివ్యాంగులకు తెలంగాణ ప్రభుత్వం (Telangana government) శుభవార్త చెప్పింది. గతంలో ఒకరు దివ్యాంగులు (disabled) మరొకరు సాధారణ వ్యక్తి పెళ్లి చేసుకుంటేనే రూ. లక్ష ప్రోత్సాహకం లభించేది. ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే వర్తించేది కాదు. ఈ సమస్య దశాబ్దాల కాలంగా వస్తూ ఉండగా తాజాగా మంత్రి సీతక్క చొరవతో దీనికి చెక్ పడింది.

ఇద్దరికీ ప్రోత్సాహకం అందేలా కాంగ్రెస్ సర్కార్ జీవో జారీ చేసింది. ఇక నుంచి ఇద్దరు దివ్యంగులు వివాహం చేసుకుంటే రూ. లక్ష ఆర్థిక సహాయం వర్తింపజేయాలని పేర్కొన్నది. ఈ మేరకు ఇవాళ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఆదేశాలు జారీ చేశారు.

Next Story