- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పర్యాటకులకు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్
by Sathputhe Rajesh |
పర్యాటకులకు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్: పర్యాటకులకు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. నెహ్రూ జూ పార్క్ టిక్కెట్ల విషయంలో ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెద్దలకు గతంలో సాధారణ రోజుల్లో రూ.60 ఉన్న ఎంట్రీ టికెట్ ధరను రూ.70, పిల్లలకు రూ.40 ఉన్న టికెట్ రేటును 45 కు పెంచింది. వారాంతాల్లో గతంలో ఈ ధర రూ.75 ఉండగా తాజాగా రూ. 80కి పెంచింది. పిల్లలకు వారాంతాల్లో 50 ఉన్న టికెట్ ధరను 55కు పెంచింది. పెంచిన టికెట్ ధరలను త్వరలో అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎప్పటినుంచి పెంపు అమలులోకి వస్తుందనే అంశంలో క్లారిటీ రావాల్సి ఉంది. టిక్కెట్ ధరలతో ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ కు భారీగా ఆదాయం సమకూరనుంది.
Next Story






