ఆసియా కప్.. మహిళా సాఫ్ట్ బాల్ జట్టులో తెలంగాణ అమ్మాయి.. మంత్రి పొన్నం అభినందనలు

by Ramesh Naini |

తెలంగాణ నుంచి ఆసియా కప్ భారత మహిళా సాఫ్ట్ బాల్ జట్టుకు ఎంపికైన (Pravalika) ప్రవల్లికకు మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు.

ఆసియా కప్.. మహిళా సాఫ్ట్ బాల్ జట్టులో తెలంగాణ అమ్మాయి.. మంత్రి పొన్నం అభినందనలు
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: (Asia Cup) తెలంగాణ నుంచి ఆసియా కప్ (Indian women's softball team) భారత మహిళా సాఫ్ట్ బాల్ జట్టుకు ఎంపికైన (Pravalika) ప్రవల్లికకు మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. భారత జట్టు వచ్చే నెల 14 నుంచి 20 వరకు చైనాలోని జియాన్‌లో జరిగే ఆసియా కప్ ఉమెన్ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్ కోసం హైదరాబాద్ కి చెందిన చెపుర్వ ప్రవల్లిక భారత జట్టుకు ఎంపిక అయింది. ఈ నేపథ్యంలోనే (శనివారం) ఈ రోజు మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం (Ponnam Prabhakar) చెపుర్వ ప్రవల్లికను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ నుంచి భారత మహిళా జట్టు క్రీడాకారిణిగా ప్రవల్లిక ఎంపికవడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. చెపుర్వ ప్రవల్లికకు ప్రత్యేక కోచింగ్ క్యాంప్ జూన్ 20 నుంచి జూన్ 25 వరకు శ్రీనగర్‌లో జరుగుతుంది. చైనా లోని జియాన్‌లో జరగనున్న ఆసియా కప్ సాఫ్ట్ బాల్ పోటీల్లో ప్రవల్లిక బాగా రాణించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు.

Next Story