- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: ఫలితాలు విడుదల.. ఎంతమంది క్వాలిఫై అయ్యారంటే?
తెలంగాణ ఈసెట్-2025 పరీక్షలో 93.87 శాతం మంది విద్యార్థులు క్వాలిఫైడ్అయ్యారని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్వి. బాలకిష్టారెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ఈసెట్-2025 పరీక్షలో 93.87 శాతం మంది విద్యార్థులు క్వాలిఫైడ్అయ్యారని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్వి. బాలకిష్టారెడ్డి తెలిపారు. ఇంజినీరింగ్కామన్ఎంట్రన్స్టెస్ట్ (ఈసెట్) ఫలితాలను ఉస్మానియా ఇంజినీరింగ్కాలేజీలో ఆదివారం ఆయన విడుదల చేశారు. ఇంజనీరింగ్కోర్సుల్లో ప్రవేశాలకు ఈసెట్పరీక్షను ఈ నెల 12న నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సెట్‌లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా పాలిటెక్నిక్డిప్లొమా, బీఎస్సీ మాథమెటిక్స్అభ్యర్థులకు బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో నేరుగా రెండో సంవత్సరంలోకి ప్రవేశాలు కల్పిస్తారు. టీజీ ఈసెట్–2025లో మొత్తం 19,672 మంది విద్యార్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా, ఇందులో 18928 మంది హాజరు అయ్యారని వీరిలో 17768 మంది (93.87) శాతం క్వాలిఫైడ్అయినట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్వి.బాలకిష్టారెడ్డి వెల్లడించారు.
సబ్జక్టుల వారీగా వివరాలను పరిశీలిస్తే కెమికల్ఇంజనీరింగ్లో 103 మంది దరఖాస్తు చేసుకోగా, 93 మంది పరీక్షలకు హాజరైనారు. వీరిలో 85 మంది (91.40) శాతం క్వాలిఫైడ్అయ్యారు. సివిల్ఇంజినీరింగ్లో 2578 మంది దరఖాస్తు చేసుకోగా, 2477 మంది పరీక్షలకు హాజరైనారు. వీరిలో 2389 మంది(96.45) శాతం క్వాలిఫైడ్అయ్యారు. కంప్యూటర్ సైన్స్అండ్ఇంజినీరింగ్లో 4879 మంది దరఖాస్తు చేసుకోగా, 4728 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 4522 మంది (95.64 ) శాతం క్వాలిఫైడ్అయ్యారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ఇంజినీరింగ్లో 5336 మంది దరఖాస్తు చేసుకోగా, 5138 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 4774 మంది (92.92 ) శాతం క్వాలిఫైడ్అయ్యారు.






