- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ డీజీపీ నియామకం వివాదం: రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశం
తెలంగాణ డీజీపీగా జితేందర్ స్థానంలో శివధర్ రెడ్డిని నియమించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని పలువురు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.

* నియామక ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నిరాకరణ..
* సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ పాటించాలని సూచన..
* వచ్చే నెల 20వ తేదీకి విచారణ వాయిదా..
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ డీజీపీగా జితేందర్ స్థానంలో శివధర్ రెడ్డి (Shivdhar Reddy)ని నియమించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని పలువురు రాష్ట్ర హైకోర్టు (State High Court)ను ఆశ్రయించారు. దీంతో విచారణ చేపట్టిన హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల రద్దుకు నిరాకరించింది. అయితే, డీజీపీ నియామక ప్రక్రియ (DGP recruitment process)పై దాఖలైన పిటిషన్‌ను విచారించిన కోర్టు, నిబంధనల ప్రకారం రెండు వారాల్లోగా అర్హులైన ఐపీఎస్ అధికారులతో కూడిన ప్యానెల్ లిస్టును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)కు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలకు (Prakash Singh judgment) అనుగుణంగానే ఈ ప్యానెల్ జాబితా ఉండాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.
UPSCకి ప్యానెల్ లిస్టు పంపిన తర్వాత, ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర వివరణతో కూడిన కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. డీజీపీ నియామకంలో పారదర్శకత ఉండాలని, సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించకూడదని ఈ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను వచ్చే నెల (జనవరి) 20వ తేదీకి వాయిదా వేసింది. అప్పటిలోగా ప్యానెల్ ప్రక్రియ పూర్తి కావాలని ప్రభుత్వం భావిస్తోంది.






