- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అదంతా భట్టి చూసుకుంటారు.. జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, మాజీ మంత్రి జానారెడ్డి(Jana Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, మాజీ మంత్రి జానారెడ్డి(Jana Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమర్క(Deputy CM Bhatti Vikramarka) నేతృత్వంలో అసెంబ్లీ ప్రాంగణంలో డీలిమిటేషన్(Delimitation)పై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం జానారెడ్డి మీడియాతో మాట్లాడారు. డీలిమిటెషన్‌పై ఉన్న ఆందోళనను అన్ని పార్టీలతో చర్చించామని అన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలు చెప్పాయి.. ఇది ప్రాసెస్‌లో ముందడుగు అని జానారెడ్డి పేర్కొన్నారు. ఇలాంటి సమావేశాలు ఇంకా ఇంకా కొనసాగుతాయని చెప్పారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్(CM Stalin) నేతృత్వంలో ఆ రాష్ట్రంలో జరుగబోయే మీటింగ్‌కు తెలంగాణ డెలిగేషన్ వెళుతుందని స్పష్టత ఇచ్చారు.
ఈ బృందంలో అన్ని పార్టీల నుండి ఒక్కొకరు ఉంటారని వెల్లడించారు. పార్టీల గైర్హాజరు తాత్కాలికమే.. భవిష్యత్తులో అన్ని కలిసి వస్తాయని కీలక వ్యాఖ్యలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఇన్విటేషన్ గురించి నాకు సమాచారం లేదని.. అదంతా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చూసుకుంటారని జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, ఎమ్ఐఎమ్, సీపీఐఎం, సీపీఐ, టీజేఎస్ నాయకుడు హాజరు కాగా, బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు గైర్హాజరు అయ్యారు.






