- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్
తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి(Janampalli Anirudh Reddy) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) కీలక నేత, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి(Janampalli Anirudh Reddy) మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బుధవారం ఆయన ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ.. ‘బనకచర్ల విషయంలో ఎమ్మెల్యేగా ప్రభుత్వానికి ఒక సూచన చేయదలుచుకున్నాను. తరచూ కేంద్రానికి లెటర్లు రాసుడు కాదు ఉత్తమ్ అన్నా.. తెలంగాణలో ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu)కు కోవర్ట్‌లు ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు చూసేది వాల్లే. ఆ కోవర్ట్‌లకు కరెంట్ కనెక్షన్, నల్లా కనెక్షన్‌లు కట్ చేయండి. ఇరిగేషన్ ప్రాజెక్టు పైసలు ఒక్క రూపాయి ఇవ్వకండి. వాల్లే చంద్రబాబు వద్దకు వెళ్లి కాళ్లు పట్టు కొని బనకచర్ల బంద్ పెట్టిస్తారు. మంచిగ మాట్లాడితే ఆంధ్ర వాళ్లు మాట వినరు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ బాలానగర్ మండలం మోతి ఘనపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం అనిరుధ్ రెడ్డి మాట్లాడారు.






