- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓట్ చోరీపై సంతకాల సేకరణ
తమ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏఐసీసీ చేస్తున్న ఓట్ చోరీ ఉద్యమానికి మద్దతుగా తెలంగాణలో పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేపట్టాలని ఏఐసీసీ పిలుపు ఇచ్చింది. దీనిలో భాగంగా మంగళవారం రాష్ట్ర ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్లు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యలతో జూమ్మీటింగ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ లు మాట్లాడారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తమ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఏఐసీసీ చేస్తున్న ఓట్ చోరీ ఉద్యమానికి మద్దతుగా తెలంగాణలో పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేపట్టాలని ఏఐసీసీ పిలుపు ఇచ్చింది. దీనిలో భాగంగా మంగళవారం రాష్ట్ర ఇంచార్జీ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్లు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యలతో జూమ్మీటింగ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ లు మాట్లాడారు. ఓట్ చోరీ సంతకాల సేకరణ ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, అక్టోబర్ 15 నాటికి గ్రామ గ్రామాన సంతకాల సేకరణ చేసి, లక్షలాది సంతకాల సేకరణను ఏఐసీసీకి పంపాలని వారు సూచించారు. డిజిటల్ మెంబర్షిప్ లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందన్నారని తెలిపారు.
మోడీ, షా ద్వయం ఇద్దరు అటు ఎన్నికల కమిషన్ ను ఇటు ఓట్ చోరీ ని నమ్ముకొని మూడో సారి అధికారంలోకి వచ్చారని, ఓట్ చోరీపై ప్రజల్లో పూర్తి అవగాహన, చైతన్యం తేవాలని, ప్రతి గ్రామంలో, అర్బన్ వార్డుల్లో సంతకాల సేకరణ చేపట్టాలన్నారు. తెలంగాణ లో స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా వస్తున్న నేపత్యంలో ఓట్ చోరీ సంతకాల సేకరణ పెద్దఎత్తున గ్రామాల్లోని ప్రజల దగ్గర చేపట్టాలని, శిబిరాలు ఏర్పాటు చేసి సంతకాల సేకరణను పెద్దఎత్తున నిర్వహించాలని మీనాక్షి నటరాజన్, మహేష్కుమార్గౌడ్లు సూచించారు. ప్రతిష్టాత్మక కార్యక్రమంగా చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో పాటు డీసీసీ అధ్యక్షులు, పలువురు ఎమ్మెల్యేలు, ఆఫీసు బేరర్లు పాల్గొన్నారు.






