తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వైద్య విధాన పరిషత్ పేరు మార్పు

by Gantepaka Srikanth |

తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వైద్య విధాన పరిషత్ పేరు మార్పు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలోని ప్రజా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్(Telangana Vaidya Vidhana Parishad) పేరు మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా నామకరణం చేశారు. దీంతో ఇకపై టీవీవీపీ ఉద్యోగులంతా ప్రభుత్వ పరిధిలోకి రాబోతున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణన (census) 2027ను చేపట్టేందుకు రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించింది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం తొలి విడత జరిగే ఇండ్ల గణన (హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్) రాష్ట్రంలో మే 11వ తేదీన ప్రారంభించి జూన్ 9 వరకు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసినట్లు చీఫ్ సెక్రెటరీ రామకృష్ణరావు వివరించారు. దీంతో పాటు రైతు భరోసా నిధుల విడుదల, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ, అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల తేదీల ఖరారు వంటి అంశాలపై నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం.

Next Story