- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ భేటీ ప్రారంభం
సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలో (Telangana Secretariat) మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది.

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన సచివాలయంలో (Telangana Secretariat) మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో రాష్ట్రంలో జరుగుతోన్న అభివృద్ధి పనులు, వాటి పురోగతిపై చర్చిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్టుతో పాటు ఆరు గ్యారెంటీల అమలు సహా.. మరికొన్ని కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. వీటితోపాటు.. తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో.. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రత్యేకంగా చర్చించనున్నారు. మొదట ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించి.. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తారని సమాచారం. ఇక ఆరుగ్యారెంటీల అమలు, రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలన్న అంశంపై సీఎం మంత్రులతో చర్చించనున్నారు. అలాగే బీసీ రిజర్వేషన్లపై కూడా ఒక నిర్ణయం తీసుకోనున్నారు.
కాగా.. గతంలో ప్రతి 3 నెలలకు ఒకసారి కేబినెట్ మీటింగ్ ను స్టేటస్ రిపోర్ట్ మీటింగ్ (Status Report Meeting)గా నిర్వహించాలని నిర్ణయించింది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకూ జరిగిన 18 కేబినెట్ మీటింగుల్లో తీసుకున్న 327 నిర్ణయాలు, వాటి అమలుపై యాక్షన్ టేకెన్ రిపోర్టును (Action Taken Report) ఈ సమావేశంలో సమర్పించి.. దానిపై కూడా చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఇక మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపై ఎన్డీఎస్ఏ, విజిలెన్స్ ఇచ్చిన నివేదికలపై చర్చించే అవకాశాలున్నాయి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ సవరణ చట్టం, రేషన్ కార్డుల జారీ, బీసీ రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు, గోశాలల నిర్మాణం తదితర అంశాలపై కూడా మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది.






