- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈనెల 16న తెలంగాణ కేబినెట్ భేటీ.. హైకోర్టు తీర్పుపై ప్రధాన చర్చ
పాత రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లొచ్చని తెలంగాణ హైకోర్టు గత అర్థరాత్రి ఆర్డర్ కాపీ విడుదల చేసింది.

దిశ, వెబ్‌డెస్క్: పాత రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలపై ముందుకు వెళ్లొచ్చని తెలంగాణ హైకోర్టు గత అర్థరాత్రి ఆర్డర్ కాపీ విడుదల చేసింది. ఇప్పుడు రాష్ట్రంలో ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. 42 శాతం బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న హైకోర్టు.. 50 శాతానికి రిజర్వేషన్లు మించకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని స్పష్టం చేసింది. 42 శాతంలో బీసీలకు 25 శాతం రిజర్వేషన్ కేటాయించి.. మిగతా 17 శాతాన్ని జనరల్ కేటగిరీకి ఇవ్వాలని సూచించింది.
దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకూ స్పందించలేదు. హైకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం తదుపరి నిర్ణయం ఏంటన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై సర్కార్.. సుప్రీంకోర్టుకు వెళ్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా.. ఈనెల 16వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అంశంతో పాటు.. హైకోర్టు తీర్పుపై కూడా మంత్రివర్గం చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులు, మెట్రో రైల్ రెండో దశ ప్రాజెక్ట్ టెండర్లపై కూడా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. మరోవైపు స్థానిక ఎన్నికల నిర్వహణపై రాష్ట్రప్రభుత్వం స్పష్టతనివ్వాలని ఎన్నికల సంఘం విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. తాజాగా హైకోర్టు జారీ చేసిన ఆర్డర్ కాపీపై ఎన్నికల సంఘం న్యాయనిపుణులతో చర్చిస్తోంది.






