Telangana Cabinet Meeting : కొనసాగుతున్న కేబినేట్ మీటింగ్.. భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు

by Muthe.Rajitha |   (  Updated:2025-03-06 15:38:10  IST  )

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన కేబినేట్ సమావేశం(Cabinet Meeting) నేడు సచివాలయంలో సుదీర్ఘంగా కొనసాగుతోంది.

Telangana Cabinet Meeting : కొనసాగుతున్న కేబినేట్ మీటింగ్.. భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు
X

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన కేబినేట్ సమావేశం(Cabinet Meeting) నేడు సచివాలయంలో సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఈ మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. ముందుగా ఎస్సీ వర్గీకరణ ముసాయిదా బిల్లుకు(SC Classification Bill) కేబినేట్ ఆమోదం తెలిపింది. అలాగే ఈనెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Budget Sessions) జరపాలని నిర్ణయించారు. ఈనెల 12 నుంచి 27 వరకు ఈ అసెంబ్లీ సమావేశాలు జరపాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇక రాష్ట్రంలో భారీగా ఉద్యోగ నోటిఫికేషన్లు(Job Notifications), ఉద్యోగాలు ఇచ్చేందుకు కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

రాష్ట్రంలో కొత్తగా 10,950 విలేజ్ లెవెల్ ఆఫీసర్(Village Level Officers) పోస్టులు మంజూరు చేస్తూ డెసిషన్ తీసుకున్నారు. కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు మంజూరు చేస్తూ మంత్రివర్గం తీర్మానం చేసింది. అలాగే 10 జిల్లా కోర్టులకు 55 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కేబినేట్ ఆమోదం తెలిపింది. రానున్న ఉగాది నుంచి భూభారతిని అమలు చేయాలని, నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ వేయాలని కేబినేట్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా అసెంబ్లీ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు(BC Reservation Bill)కు ఆమోదం తెలిపి, పార్లమెంటులో కూడా ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు రేవంత్ సర్కార్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. బీసీ రిజర్వేషన్ల బిల్లు చట్టబద్ధత పొందిన అనంతరం వాటి ప్రకారం స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు, రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.

Next Story