కొనసాగుతోన్న తెలంగాణ కేబినెట్ భేటీ.. రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేస్తూ నిర్ణయం

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-30 09:09:46  IST  )

తెలంగాణ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది.

కొనసాగుతోన్న తెలంగాణ కేబినెట్ భేటీ.. రిజర్వేషన్లపై పరిమితి ఎత్తివేస్తూ నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన అసెంబ్లీ (Assembly)లోని కమిటీ హాలులో కేబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, సీఎస్ రామకృష్ణ రావు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగంగా రాష్ట్రంలో పంచాయతీరాజ్‌ చట్టం-2018లోని సెక్షన్‌ 285 (A)కు సవరణ చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది. భౌగోళిక, సామాజిక ఆర్థిక పరిస్థితులు, రాజకీయ వెనుకబాటు, సర్వే సమాచారాన్ని దృష్టిలో పెట్టుకుని అసాధారణ పరిస్థితుల్లో సంబంధిత స్థానిక సంస్థల్లోని పరిస్థితుల ఆధారంగా 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అయితే, రిజర్వేషన్ల పరిమితిపై గత ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానం‌లో అసెంబ్లీ‌లో బిల్లు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా విద్య, ఉపాధి, ఉద్యోగం, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ప్రత్యేక జీవో తీసుకురావాలని మంత్రివర్గ భేటీలో నిర్ణయించారు.

Next Story