vote chori: ఎంపీ ఈటల రాజేందర్ మెజార్టీ వెనుక ఓటు చోరీ.. పీసీసీ చీఫ్ సంచలన ఆరోపణలు

by Prasad Jukanti |   (  Updated:2025-09-27 08:09:47  IST  )

తెలంగాణ బీజేపీలో కొంత మంది ఓట చోరీ వల్లే గెలిచారని మరోసారి మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

vote chori:  ఎంపీ ఈటల రాజేందర్ మెజార్టీ వెనుక ఓటు చోరీ.. పీసీసీ చీఫ్ సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీ ఎంపీల్లో కొందరు ఓటు చోరీ వల్లే గెలిచారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాను ఈ ఆరోపణలను గతంలో కరీంనగర్ లోనే చేశానని, అక్కడ ఒక షెడ్డులో 40 ఓట్లు నమోదు అయ్యాయని అన్నారు. వీటిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సమాధానం చెప్పాలని డిమాండ్ చేసినా ఇప్పటి ఆయన వరకు సమాధానం చెప్పలేదన్నారు. తాజాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోనూ ఓట్లలో అవకతవకలు జరిగాయన్నారు. ఈటల రాజేందర్‍కు (Eatela Rajender) మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో మూడు లక్షల మెజార్టీ వచ్చిందంటే దీంట్లో గోల్ మాల్ జరిగిందని ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదని లేదన్నారు. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై ఎన్నికల కమిషన్ సరైన రీతిలో సమాధానం చెప్పకపోగా బీజేపీకి ఈసీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ మాదిరిగా మాట్లాడుతోందని ఆరోపించారు.

జీహెచ్ఎంసీలోనూ ఓటు చోరీ:

ఈ ఓటు చోరీ అంశం కొత్త కాదని 2016లో జీహెచ్ఎంసీ పరిధిలో నాటి ప్రభుత్వం ఓటు చోరీకి పాల్పడిందని మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రేవంత్ రెడ్డి, జి. నిరంజన్ రెడ్డి వంటి వారు ఫిర్యాదు చేస్తే ఎలక్షన్ కమిషన్ కు అప్పీల్ చేస్తే తిరిగి ఓట్లు చేర్చారని చాలా సందర్భాల్లో ఓటు చోరీకి పాల్పడుతున్నారని రుజువు అవుతోందని ఇలాంటి పరిణామాలు ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి వల్ల ఈసీ రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశంపై సరైన రీతిలో స్పందించకపోవచ్చు. కానీ 80 శాతానికి పైగా ఈ దేశ ప్రజలు ఓటు చోరీ జరిగిందని నమ్ముతున్నారని అందువల్లే ఓటు చోరీ అంశంపై సిగ్నేచర్ క్యాంప్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్యాంప్ లో రాష్ట్ర ప్రజలంతా పాల్గొనాలని పీసీసీ చీఫ్ పిలుపునిచ్చారు.

Next Story