- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గతంలో ఇవ్వొద్దని.. నేడు అదే సినిమా హీరోకి అవార్డు.. గద్దర్ అవార్డులపై బీజేపీ తీవ్ర విమర్శలు..
నేర ప్రవృత్తి, ఎర్రచందనం స్మగ్లింగ్‌ను వంటి వాటిని ప్రొత్సహించే సినిమాకు జాతీయ అవార్డు ఇవ్వడం ఏమిటని గతంలో మంత్రి సీతక్క పుష్ప సినిమాను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: నేర ప్రవృత్తి, ఎర్రచందనం స్మగ్లింగ్‌ను వంటి వాటిని ప్రొత్సహించే సినిమాకు జాతీయ అవార్డు ఇవ్వడం ఏమిటని గతంలో మంత్రి సీతక్క (Minister Seethakka) పుష్ప సినిమాను ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో (Gaddar Film Awards) గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించారు. అందులో పుష్పా-2 లో నటించిన అల్లు అర్జున్‌కు ఉత్తమ నటుడిగా అవార్డు ప్రకటించారు. దీంతో గతంలో పుష్ప సినిమాపై మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా తెలంగాణ బీజేపీ (Telangana BJP) వీడియో షేర్ చేస్తూ గద్దర్ అవార్డులపై తీవ్ర విమర్శలు చేసింది. రంగు రంగుల జెండాలు మార్చిన రంగోలి రేవంత్ (CM Revanth Reddy) నాయకత్వంలో.. అసలు రంగు మర్చిపోయినట్టున్నారు కాంగ్రెస్ (Congress) నాయకులు.. అని విమర్శించింది.
కల్పిత పాత్రలున్న సినిమాలోని ఒక పోలీసు క్యారెక్టర్‌ను అవమానించారని సినిమాకి అవార్డు ఇవ్వొద్దని కాంగ్రెస్ నాయకులు అంటారని తెలిపింది. అదే సినిమా హీరోకి ఉత్తమ నటుడు అవార్డు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇస్తుందని వెల్లడించింది. పోలీసులపై ఇంత ప్రేమ ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.. అదే పోలీసుల ఊచకోతకు కారణమైన గద్దర్ పేరును ఉత్తమ అవార్డులకు పెడతారు.. అమాయక ప్రజల, పోలీసుల ప్రాణాలను కబళించే నక్సలైట్లను కేంద్ర ప్రభుత్వం అణచివేస్తుంటే కాంగ్రెస్ నాయకులే అడ్డుపడతారు.. అని ఆరోపించింది. కల్పిత పాత్ర అయిన పోలీసును సినిమాలో అవమానిస్తే బాధపడుతున్న మంత్రి అనసూయ.. నిజ జీవితంలో పోలీసులను ఊచకోత కోసిన నక్సలైట్లకు శ్రద్ధాంజలి ఘటిస్తారు.. వారి ఆశయ సాధనకు పాటు పడతామంటారు.. నక్సలిజం నిర్మూలనకు పూనుకున్న మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారు.. అని ఆరోపించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కపట బుద్ధి చూసి.. ఊసరవెల్లి కూడా ఉరేసుకుంటుందని ఎక్స్‌లో తీవ్ర విమర్శలు చేసింది.






