- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ నూతన భవనంలోని ఎఫ్-101 వసుధలో ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ (Vice President Election) ప్రారంభమైంది. మంగళవారం ఉదయం 10 గంటలకు పోలింగ్ ప్రారంభమవ్వగా.. ప్రధాని నరేంద్ర మోడీ తొలి ఓటు వేశారు. సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరగనుండగా.. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ఎన్నికల ప్రక్రియ జరుగుతోంది. 6 గంటల నుంచి ఓట్లను లెక్కించి.. ఈ రాత్రికే ఉపరాష్ట్రపతి ఎవరో ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ (Telangana BJP), కాంగ్రెస్ (Congress MP) ఎంపీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. అలాగే తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఓటు వేసినట్లు తెలుస్తోంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ పై ఢిల్లీలో మధ్యాహ్నం ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. కాగా, బీఆర్ఎస్, బీజేడీ పార్టీలు మినహా అన్ని పార్టీలు ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ లో పాల్గొంటున్నాయి. ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, విపక్షాల అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. వీరిలో సుదర్శన్ రెడ్డి తెలుగు వ్యక్తి అయిన విషయం తెలిసిందే.






