వారిని బీసీలుగా గుర్తించే ప్రసక్తే లేదు: స్థానిక ఎన్నికల వేళ బీజేపీ చీఫ్ క్లారిటీ

by Gantepaka Srikanth |

ఓట్‌ చోరీ అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు(Ramchander Rao) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

వారిని బీసీలుగా గుర్తించే ప్రసక్తే లేదు: స్థానిక ఎన్నికల వేళ బీజేపీ చీఫ్ క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఓట్‌ చోరీ అంటూ కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలకు తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు(Ramchander Rao) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓట్ చోరీ కాదు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) బ్రెయిన్ చోరీ అయిందని విమర్శించారు. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 46 శాతం సీట్లు బీసీలకే ఇవ్వడానికి తమ పార్టీ సిద్ధమని ప్రకటించారు. కానీ.. ఎట్టి పరిస్థితుల్లో ముస్లింలను బీసీలుగా మాత్రం గుర్తించబోమని సంచలన ప్రకటన చేశారు. స్థానిక ఎన్నికలను నిర్వీర్యం చేసేందుకే కాంగ్రెస్ కుట్ర చేస్తోందని ఆరోపించారు. అందుకే ఎన్నికలు కూడా నిర్వహించడం లేదని అన్నారు.

ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎన్ని అసత్య ప్రచారాలు చేయాలో అన్నీ చేస్తున్నారని అన్నారు. మహిళలకు ఇస్తామన్న రూ.2500 ఇవ్వడం లేదు.. నిరుద్యోగులకు ఇస్తామన్న నోటిఫికేషన్లు ఇవ్వడం లేదు.. రూ.లక్ష తోపాటు తులం బంగారం ఇవ్వడం లేదు.. పెంచి ఇస్తామని పింఛన్లు ఇవ్వడం లేదు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలు గంగలో కలిపారని సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ నేతలకు దమ్ముంటే ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తే.. అప్పుడు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని జోస్యం చెప్పారు.

Next Story