Diwali: ఈ దీపావళికి స్వదేశీ ఉత్పత్తులను వినియోగించండి: తెలంగాణ బీజేపీ పిలుపు

by Ramesh Naini |

దీపావళి పండుగ సందర్భంగా స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలంటూ తెలంగాణ బీజేపీ పిలుపునిచ్చింది.

Diwali: ఈ దీపావళికి స్వదేశీ ఉత్పత్తులను వినియోగించండి: తెలంగాణ బీజేపీ పిలుపు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దీపావళి పండుగ (Diwali festival) సందర్భంగా స్వదేశీ ఉత్పత్తులను వినియోగించాలంటూ తెలంగాణ బీజేపీ (Telangana BJP) పిలుపునిచ్చింది. ఆదివారం పార్టీ ఎక్స్ వేదికగా అధికారికంగా విడుదల చేసిన పోస్టర్‌లో "ఈ దీపావళికి మన ఇళ్లను మరింత కాంతివంతం చేద్దాం, స్వదేశీ వస్తువులను ఎంచుకుందాం" అనే నినాదాన్ని ప్రదర్శించింది.

భారత్‌లో తయారైన ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, దీపాల కోసం LED లైట్లు, హస్తకళ ఉత్పత్తులను ఉపయోగించాలని సూచించింది. దేశీయ కార్మికుల కృషికి తోడ్పాటుగా ఉండేలా స్వదేశీ వస్తువుల కొనుగోలు ద్వారా పండుగను మరింత అర్థవంతంగా చేసుకోవాలని బీజేపీ పిలుపునిచ్చింది. పండగ సామాగ్రిని అంతటిని మేడిన్ ఇండియా అని నిర్ధారించుకున్న తర్వాతే కొనుగోలు చేద్దామని, మన పండగను మన వస్తువులతోనే జరుపుకుందామని తెలంగాణ బీజేపీ పేర్కొంది. ఈ సందర్భంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేసింది.

కాగా, పార్టీ విడుదల చేసిన పోస్టర్‌లో కుటుంబ సమేతంగా భారతీయ మార్కెట్లలో షాపింగ్‌ చేస్తున్న దృశ్యాలు, ‘Made in India’ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్న చిత్రాలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.

Next Story