BhuBharati : తెలంగాణ "భూభారతి" పోర్టల్ ప్రారంభం

by Muthe.Rajitha |   (  Updated:2025-04-14 14:14:11  IST  )

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతున్న "భూభారతి"(BhuBharati) పోర్టల్ ప్రారంభం అయింది.

BhuBharati : తెలంగాణ భూభారతి పోర్టల్ ప్రారంభం
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెడుతున్న "భూభారతి"(BhuBharati) పోర్టల్ ప్రారంభం అయింది. హైదరాబాద్ లోని శిల్పాకళా వేదికలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ పోర్టల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహ పలువురు నేతలు పాల్గొన్నారు. తొలుత ఈ పోర్టల్ ను 3 మండలాల్లో(సాగర్, తిరుమలగిరి, కీసరలో) ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అమలు చేయనున్నారు. ఈ పోర్టల్ పై ప్రజల నుంచి వచ్చే సూచనలు తీసుకొని, అవసరమైన సవరణలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రతి జిల్లా కలెక్టర్ భూభారతి పోర్టల్ పై అవగాహన కలిగి ఉండాలని ఇదివరకే సీఎం అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు.

Next Story