ఇంకా పెండింగ్‌లోనే తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లు

by Gantepaka Srikanth |

బీసీ రిజర్వేషన్ల బిల్లు(BC reservation bill)పై రాజ్‌భవన్(Raj Bhavan) ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

ఇంకా పెండింగ్‌లోనే తెలంగాణ బీసీ రిజర్వేషన్ల బిల్లు
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీ రిజర్వేషన్ల బిల్లు(BC reservation bill)పై రాజ్‌భవన్(Raj Bhavan) ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీసీ బిల్లుకు గవర్నర్(Jishnu Dev Varma) ఆమోదం లభించినట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలో ఎలాంటి నిజం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండటే.. మొత్తం నాలుగు బిల్లులను ప్రభుత్వం గవర్నర్ వద్దకు పంపించగా, అందులో జిన్నారం మున్సిపాలిటీలో గ్రామాల చేర్చే పంచాయతీ, మున్సిపల్ చట్ట సవరణకు ఆమోదం లభించింది. పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్ల క్యాప్ ఎత్తివేస్తూ అసెంబ్లీ ఆమోదించిన చట్టం మాత్రం ఇంకా పెండింగ్‌లో ఉన్నది. దీనికి గవర్నర్ ఆమోదం లభిస్తుందా? లేదా? అనేది ఆసక్తికగా మారింది. మరోవైపు పలు గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ జారీ చేసిన మెమోతో గందరగోళం ఏర్పడినట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే బీసీ రిజర్వేషన్ల పెంపునకు అడ్డంకిగా మారిన ‘పంచాయతీరాజ్​ చట్టం-2018’లోని సెక్షన్ 285 (ఏ)కు, మున్సిపల్​చట్టం-2019లోని సెక్షన్​29కు సవరణ చేస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులను ఉభయసభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి.

Next Story