- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Assembly Sessions: జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు..!
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో శీతాకాల అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టిన సందర్భంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఇందులో భాగంగా శీతాకాల అసెంబ్లీ సమావేశాలపై క్లారిటీ ఇచ్చారు. జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు పెడతామని ఆయన అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ సభకు హాజరవ్వాలి.. సమస్యలపై చర్చిద్దామని సవాల్ చేశారు. కాగా, అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలపై సీఎం అధ్యక్షతన రేపు లేదా ఎల్లుండి అనధికారిక సమావేశం జరగనున్నట్లు తెలిసింది. సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల తేదీలు ప్రకటించడంతో పాటు ఎన్ని రోజులు నిర్వహంచాలన్న అంశంపై కూడా స్పష్టత రానుంది. ఈ సమావేశాల్లో 7 ఆర్డినెన్స్‌ల స్థానంలో బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలు ఎలా? అన్ని రాజకీయ పక్షాల నుంచి అభిప్రాయాల కోసం చర్చలు సాగే ఛాన్స్ ఉంది.






