- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: ఐదు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
తెలంగాణ మున్సిపాలిటీల (నాలుగో సవరణ) బిల్లు-2025, జీహెచ్‌ఎంసీ (సవరణ) బిల్లు-2025, జీహెచ్‌ఎంసీ (రెండో సవరణ) బిల్లు-2025తో పాటు తెలంగాణ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు-2025 ఉన్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: మూడు రోజుల విరామం తర్వాత ఇవాళ (జనవరి 02) శుక్రవారం తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) సమావేశాలు మొదలయ్యాయి. ఇవాళ ఐదు కీలక బిల్లులను సభ ఆమోదించింది. ఇందులో అత్యధికంగా నాలుగు బిల్లులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ప్రవేశపెట్టారు. తెలంగాణ మున్సిపాలిటీల (నాలుగో సవరణ) బిల్లు-2025, జీహెచ్‌ఎంసీ (సవరణ) బిల్లు-2025, జీహెచ్‌ఎంసీ (రెండో సవరణ) బిల్లు-2025తో పాటు తెలంగాణ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు-2025 ఉన్నాయి. అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. తెలంగాణ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ (సవరణ) బిల్లు-2025ను సభలో ప్రవేశపెట్టారు. ఈ ఐదు బిల్లులను సభ ఆమోదించింది. అంతకుముందు అసెంబ్లీ శీతాకాల సమావేశాలను బాయికాట్ చేయాలని బీఆర్‌ఎస్ (BRS) నిర్ణయించింది. ఈ విషయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు మీడియా ద్వారా తెలియజేశారు. స్పీకర్, ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీ సమావేశాలను బాయ్ కాట్ చేస్తున్నామని స్పష్టం చేశారు. అసెంబ్లీ తీరు చూస్తుంటే శాసనసభ నిబంధనలకు విరుద్ధంగా ఉందని మండిపడ్డారు.






