- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Governor Prorogation : తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాలు ప్రోరోగ్
తెలంగాణ అసెంబ్లీ(Telangana Legislative Assembly), మండలి(Telangana Legislature Council) సమావేశాలకు లైన్ క్లియర్ అయింది.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ(Telangana Legislative Assembly), మండలి(Telangana Legislature Council) సమావేశాలకు లైన్ క్లియర్ అయింది. త్వరలోనే తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు జరపనుండగా.. దానికి గల సాంకేతిక సమస్యలు గవర్నర్ ప్రోరోగ్(Governor Prorogation) తో సమసిపోయాయి. ఈ దఫా బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో.. గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలు కావాలంటే, గతంలో వాయిదా పడిన సభలను ప్రోరోగ్ చేయాల్సి ఉంటుంది. అయితే గత డిసెంబర్లో ఇరు సభలు వాయిదా పడగా వాటిని ప్రస్తుతం ప్రోరోగ్ చేయడంతో, కొత్త సమావేశాలు జరుపుకునేందుకు వీలు కలిగింది. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor JishnuDev varma) శాసన సభ, శాసన మండలి సమావేశాలను ప్రోరోగ్ చేస్తున్నట్టు ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేశారు. కాగా మార్చి రెండో వారంలో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు(Telangana Budget Sessions) జర గనున్నట్టు సమాచారం. సభలు ప్రోరోగ్ కావడంతో బడ్జెట్ పనులను సర్కార్ మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోద ముద్ర వేయనున్నారు.






