తెలంగాణ అసెంబ్లీ వాయిదా

by Gantepaka Srikanth |

తెలంగాణ శాసనసభ సమావేశాలు శనివారం ఆసక్తికరమైన చర్చల మధ్య కొనసాగాయి.

తెలంగాణ అసెంబ్లీ వాయిదా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసనసభ సమావేశాలు శనివారం ఆసక్తికరమైన చర్చల మధ్య కొనసాగాయి. వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన బడ్జెట్ పద్దులపై సభలో జరిగిన చర్చ ఈరోజుతో ముగిసింది. సభ్యులు అడిగిన ప్రశ్నలకు, లేవనెత్తిన అంశాలకు సంబంధిత మంత్రులు వివరణలు ఇచ్చారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రభుత్వం ప్రతిపాదించిన వివిధ శాఖల బడ్జెట్ కేటాయింపులపై అధికార, ప్రతిపక్ష సభ్యులు సుదీర్ఘంగా చర్చించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులకు కేటాయించిన నిధుల వినియోగంపై చర్చ జరిగింది. పద్దులపై చర్చ పూర్తి కావడంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభను ఆదివారానికి (రేపటికి) వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. షెడ్యూల్ ప్రకారం, రేపు సభలో అప్రోప్రియేషన్ బిల్లు (Appropriation Bill) పై చర్చ జరగనుంది. ఈ బిల్లు ఆమోదం పొందితేనే ప్రభుత్వం బడ్జెట్ నిధులను వెచ్చించేందుకు పూర్తిస్థాయిలో అనుమతి లభిస్తుంది. కాగా, మార్చి 30తో ఈ బడ్జెట్ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో, చివరి రెండు రోజులు అత్యంత కీలకం కానున్నాయి. ప్రధానంగా పెండింగ్ బిల్లులు మరియు ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలపై సభలో మరిన్ని వేడివేడి చర్చలు జరిగే అవకాశం ఉంది.

Next Story